తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కథలతో ముందుకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో. భిన్నమైన లైనప్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో ప్రతీ సినిమాలో కూడా తన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇతను హీరోగా నటిస్తున్న గామి కూడా అలాంటి కథే.డైరెక్టర్ విద్యాధర్ కగిట ఈ చిత్రాన్ని అడ్వెంచర్‌ డ్రామాగా తెరపైకి తీసుకు వస్తున్నాడు.మొదట్లోనే పాజిటివ్ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ షూటింగ్‌ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. హైదరాబాద్ లో కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టివల్ లోనే గామి ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. మానవ స్పర్శకు దూరంగా ఉండే ఒక వ్యక్తి అఘోరా గా ఎలా మారాడు అనే లోతైన సత్యం కోసం అతని అన్వేషణ ఎక్కడి వరకు సాగింది అనే పాయింట్ తో ఈ మూవీ తెరపైకి రానుంది.పైగా ఆ సినిమా కథలోని చాలా అంశాలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి దాకా ఏ సినిమా రాలేదు.ఈ సినిమా ఖచ్చితంగా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గామి సినిమా ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. ఆ విషయంపై మూవీ యూనిట్ కూడా అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది.


విశ్వక్ సేన్  గామి షోరీల్ ట్రైలర్, PCX ఫార్మాట్‌ లో మొట్టమొదటి ట్రైలర్ గా రానుంది. PCX స్క్రీన్, ప్రసాద్స్‌లో ఫిబ్రవరి 29న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ఈ ట్రైలర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ పోస్టర్స్ అంచనాల స్థాయిని పెంచేశాయి. ఇక ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్ లో రానున్న ఈ ట్రైలర్ కూడా సూపర్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుందట.విద్యాధర్ కగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీలో  చాందినీ చౌదరి అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఇక వరల్డ్ వైడ్ గా గామి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వీ సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తోంది. గామి మూవీ కోసం నాలుగేళ్లగా పని చేస్తున్నామని హీరో ఇటీవలే విశ్వక్ చెప్పారు. ఈ మూవీలో ఆయన శంకర్ అనే అఘోరగా నటిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: