అనుష్క శెట్టి టాలీవుడ్ సిటీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు హీరోలతో సమానంగా అనుష్క ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో అనుష్క సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈమె అధిక శరీర బరువు పెరగటం వల్ల ఇన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనుష్క నటిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా అనుష్క అసలు వ్యక్తిత్వం గురించి మేకప్ మాన్ రామచంద్ర రావు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన అనుష్క నటించిన రెండు మూడు సినిమాలకు మేకప్ మెన్ గా మారాడు.

ఆ పరిచయంతోనే ఈయన నిర్మాతగా అనుష్క పంచాక్షరి అనే సినిమాలో నటించినట్టు తెలిపారు. అనుష్క మంచి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయి తనకు తెలిసిన వారికి కనుక సమస్య వస్తే తనకే సమస్య వచ్చిందని ఫీల్ అవుతుందని ఆయన తెలియజేశారు.ఆమెలో మంచి దయాగుణం చాలా ఎక్కువ అని ఏ హీరోయిన్లలో కూడా అలాంటి క్వాలిటీస్ లేవని తెలిపారు. ఇక ఆమె మొహమాటానికి కాకుండా మనసుతో పని చేస్తుందని తెలిపారు.   చాలా జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పాడు. ఏ విషయంలోనూ, మనీ విషయంలోనూ ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టదన్నారు.అలాంటి ఒక గొప్ప అమ్మాయి ఇండస్ట్రీకి దొరకడం అదృష్టం అని అలాంటి అమ్మాయి ఇకపై రావటం కష్టం అని తెలిపారు. ఇక ఆమెను ఎవరు కూడా మిస్ యూస్ చేయరని ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ క్యారెక్టర్ కనిపెట్టలేనంత పిచ్చిది కాదని, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది. అందుకే తనని ఎవరు వేలెత్తి చూపించరు అంటూ మేకప్ మెన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: