బాలీవుడ్ హీరో రణబీర్ కఫూర్, అందాల తార రష్మిక జోడిగా నటించిన మూవీ యానిమల్. ఈ మూవీ రిలీజై తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని బాక్సాఫీస్లని షేక్ చేసింది.ఇక నెగటివ్ టాక్ తో వచ్చిన ఈ మూవీ ఆ తరువాత ఊహించని స్థాయిలో కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. అంతేకాకుండా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
యానిమల్ మూవీ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది..బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక. వీరిద్దరి జోడి యానిమల్ మూవీలో ఎంతో చూడచక్కగా ఉందనే చెప్పాలి.ఈ మూవీలో రణబీర్ కపూర్ రోల్ ఎంత ముఖ్యమో..తన పక్కన యాక్ట్ చేసిన రష్మిక రోల్ కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆమె అంతలా నటించింది. కాదు..కాదు.. జీవించింది. ఇక ఈ విషయాన్ని అలా ఉంచితే.. తాజాగా ఈ మూవీ విజయాన్ని రష్మిక మిగతా బృందం స్థాయిలో సొంతం చేసుకోలేకపోయారనే అభిప్రాయాలున్నాయి. రిలీజ్ తరువాత జరిగిన వేడుకల్లో ఆమె కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.దీనిపై రష్మిక ఇన్ స్టా ద్వారా రియాక్ట్ అయ్యారు. మూవీ రిలీజైన మరుసటి రోజు నుంచే తను ఒప్పుకున్న ఇతర మూవీస్ కోసం సెట్స్ కి రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. నాపైన ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. మేం ఓ మంచి మూవీని అందించాం. ఆడియెన్స్ కనెక్ట్ అయి మా మూవీని ఆదరించారు. అందరూ అనుకున్నట్టుగానే నేనూ ఈ మూవీ ఘనవిజయాన్ని ఆస్వాదించడానికి కొంత టైం కేటాయించాలనుకున్నా. కానీ.. మరుసటి రోజు నుంచే నాకు చిత్రీకరణలు స్టార్ట్ అయ్యాయి. నా కెరీర్ లో అతిపెద్ద, కీలకమైన మూవీల్లో యాక్ట్ చేస్తున్నా.. వాటికోసం రాత్రిళ్లూ ట్రావెల్స్ చేయాల్సి వస్తోంది.పని విషయంలో నాకున్న డెడికేషన్ అలాంటిది అని రష్మిక చెప్పుకొచ్చింది. అందుకే చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయానని.. నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు కానీ.. నేను చేస్తున్న మూవీస్ ఆ లోటుని భర్తీ చేస్తాయని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. అవి అంతలా అలరిస్తాయి. వాటిని ఆడియెన్స్ ఆస్వాదించే క్షణాల కోసం ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నా.. అంటూ ఓ పోస్ట్ ని పంచుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె ఫుష్ప ది రూల్ తో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి తదితర మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: