చాలా కాలం తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్ కొట్టాడు. సినీ ఇండస్ట్రీలో హిట్లు, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ కుర్ర హీరో సాలిడ్ సక్సెస్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఊరుపేరు భైరవ కొన సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బోల్లమ్మ హీరోయిన్స్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మొదటి షో నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పాట్నర్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందట. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఫిబ్రవరి 16న విడుదలైంది. ఊరుపేరు భైరవ కోన ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ మంచి ధరకే అమ్ముడుపోయాయని ఇన్ సైడ్ టాక్. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన హారర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'.

 ఫాంటసీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం చాలారోజులు షూటింగ్ జరుపుకొని ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నాయి. సోమవారం వరకు అంటే దాదాపు 10 రోజుల్లో రూ.25.11 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరోనే పోస్ట్ చేశాడు.  'ఊరు పేరు భైరవకోన' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అలానే థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 15న అలా ఓటీటీలోకి రావొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: