సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుప రిచితమే.ఇటీవల గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మహేష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఇక మహేష్ ఖాతాలో ఇటువంటి సినిమా పడడం తో తమ ఫ్యాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయిన ప్పటికీ నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది అనే ధైర్యం తో ఉన్నార.ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సంవత్సరకాలం పడు తుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరకాలం పాటు మహేష్ కి రాజమౌళి కొన్ని కండిషన్స్ని పెట్టాడట. సహజంగా రాజమౌళి తో సినిమా చేయాలంటే మరి ఏ సినిమాకి కమిట్ అవ్వకూడదు. అలా అయితేనే రాజమౌళి వారితో సినిమా చేస్తాడు.ఇప్పటికే చాలామంది హీరోలని ఈ విధంగా రుద్ది రుద్ది వారి ఖాతాలో బ్లాక్బస్టర్ హిట్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మహేష్ విషయంలో కూడా ఇదే జరుగు తుంది. మహేష్ విషయంలో చాలా స్ట్రీట్ రూల్స్ ని స్టిట్ చేశాడట రాజమౌళి. ఇప్పుడు మొదలయ్యే మార్చ్ నెల నుంచి మహేష్ మరి ఏ లొకేషన్స్ కి వెళ్లకూడదని… అదే విధంగా ఎటువంటి పబ్లిక్ గాథరింగ్స్ లోకి హాజరవ్వ కూడదని వెల్లడించాడట రాజమౌళి.ఈవెంట్ ఫంక్షన్స్ మరియు ఇతర మ్యారేజ్ ఫంక్షన్ కి కూడా హాజరవ్వొద్దని కండిషన్ పెట్టాడట. ఇప్పటినుంచి మూవీ కంప్లీట్ అయ్యేవరకు మహేష్ ని మీడియా కంటికి కనిపించవద్దని జక్కన్న కండిషన్ పాస్ చేశాడట. అందువల్లే మహేష్ ఇప్పటినుంచే వాటిని అలవాటు చేసుకునేందుకు ప్రయత్ని స్తున్నాడట. ఏదేమైనా ఇది పెద్ద స్టిట్ రూల్స్ అనే చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్లకుండా సోషల్ మీడియాలో కూడా తన ఫొటోస్ ని షేర్ చేయకుండా ఉండడం చాలా కష్టం. కానీ తమ ఖాతాలో సూపర్ హిట్ విజయం పడాలంటే ఈ కష్టం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: