బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమస్ అయిన వారిలో శ్రీ సత్య కూడా ఒకరు.బిగ్బాస్ సీజన్ 6 లో పాల్గొన్న ఈమె ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుని గెలుచుకుంది. బిగ్బాస్ లో ఆమె నడిచిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అదేవిధంగా ఆమె కష్టాలను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు కూడా. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోక ప్రేమించిన యువకుడు దూరమై ఉన్న శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి జనాలతో కలవడం నేర్చుకుంది.తనకి బిగ్ బాస్ లైఫ్ అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని పలు ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసింది. అదేవిధంగా టాప్ ఫైవ్ వరకు కొనసాగింది. ఇక ప్రస్తుతం శ్రీ సత్య బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి శ్రీ సత్య కి గతంలో ఓ యువకుడుతో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అతను పేరు పవన్. ఆ యువకుడుని ఎంతో ఇష్టంతో ప్రేమించిన శ్రీ సత్య అతని చేతిలో మోసపోయింది.ఇక వీరిద్దరి నిశ్చితార్థం అనంతరం పెళ్లి కూడా చేసుకుంటారు అని అనుకునే సమయంలో ఏమో గొడవలు కారణంగా ఇద్దరు విడిపోయారు. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇక ఈ బాధ నుంచి కోల్కోవడానికి శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం పైకి బానే కనిపిస్తున్న లోపల మాత్రం చాలా చింతిస్తుంది. ఇక జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ డాన్స్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ఆవేదనను బయటపెట్టింది.

మీకు లైఫ్ లో ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉన్నారా? అని ఉదయ్ భాను ప్రశ్నించగా..' బ్రతికే ఉన్నారు బట్ నాతో లేరు ' అంటూ ఎమోషనల్ అయ్యింది శ్రీ సత్య. ప్రస్తుతం శ్రీ సత్య కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు…' పాపం ఎంత లవ్ ఉంటే అంతలా ఏడుస్తుంది? ప్రేమ అనేది ప్రస్తుత కాలంలో ఒక టైం పాస్ కింద తీసుకుంటున్నారు? నీకు ఇంకా బెటర్ లైఫ్ దొరుకుతుంది ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: