ప్రస్తుతం మనం సోషల్ మీడియా జమానాలో బతుకుతున్నాం. ఎవరెప్పుడు ఎలా పాపులరాటీ తెచ్చుకుంటారో ఎవ్వరూ ఉహించలేరు. అలా సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ తమ టాలెంట్స్ ను బయట పెట్టి..మంచి మంచి అవకాశాలు సంపాదిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా అలా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ అనే వ్యక్తి ఏకంగా సినిమా ఆడిషన్ కు రమ్మని పిలుపందుకున్నాడు. అది కూడా విశ్వక్ సేన్ నుంచి పిలుపు రావడం విశేషం.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తుంది. ఫలానా హీరోను, హీరోయిన్ ను ట్యాగ్ చేస్తూ..ఇప్పుడు నేనలా చేయాలంటే, ఇలా చేయాలంటే.. ఆ హీరో నా పోస్ట్ కు కామెంట్ చేయాలని చాలా మంది పోస్ట్ లు పెడుతున్నారు. విజయ్ దేవరకొండతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్.. ఇప్పుడు విశ్వక్ సేన్ దగ్గరికి వచ్చింది.సుధీర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా మున్నా సినిమాలోని మనసా మనసా పాటలో కూసే కోయిల స్వయంగా అంటూ సాగే బీట్ కు డ్యాన్స్ చేస్తూ.. విశ్వక్ సేన్ ఈ రీల్ కు కామెంట్ చేస్తే నేను, నా ఫ్రెండ్ బూతులు మాట్లాడము, గొడవలు పడము అని పోస్ట్ పెట్టాడు.దీనికి విశ్వక్ సేన్.. ఏది ఆపకు, రేపు కల్ట్ ఆడిషన్ లో కనబడు..

మంచి ఫ్యూచర్ ఇస్తా నీకు అని రిప్లయ్ ఇచ్చాడు. ఇలా రీల్ పెడితే సినిమాలో ఛాన్స్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. దీనిపై పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నావు. రీల్ తో సినిమా చాన్స్ కొట్టేశావ్ బ్రో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆ మధ్య విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తే.. నేను చదవడం మొదలు పెడతాను అని బెంగళూరుకు చెందిని ఓ స్టూడెంట్ కామెంట్ పెడితే.. దానికి విజయ్ వంద శాతం రిజల్ట్ తెచ్చుకో.. కలుస్తాను అని రిప్లయ్ ఇచ్చాడు.అలా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఐదేళ్ల కిందట పట్టాలెక్కిన ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణం జరుపుకుంది. ఈ సినిమాలో విశ్వక్ శంకర్‌ అనే అఘోరగా కనిపించబోతున్నాడు.ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేసింది. అంతు చిక్కని సమస్యతో బాధ పడుతున్న విశ్వక్ తన సమస్యకు పరిష్కారం కోసం ప్రయాణం సాగిస్తాడు? అసలు తన సమస్య ఏంటీ? తన సమస్యకు పరిష్కారం దొరికిందా అనే కాన్సెప్ట్ సినిమా తెరకెక్కిన్నట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: