గచ్చిబౌలిలోని డ్రగ్స్ కేస్ ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలాన్నే రేపుతోంది.. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొంతమంది యువకులను సైతం పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.ఇందులో చాలా గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారని ఇందులో ప్రముఖ బిజెపి నేత కుమారుడు, ప్రముఖ వ్యాపార కుమారులు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పక్క సమాచారం తోనే పోలీసులు రాడిసన్ హోటల్ పైన దాడి చేశారని దీనితో పెద్ద ఎత్తున అక్కడ డ్రగ్స్ తీసుకున్న వారందరినీ పట్టుకున్నట్టు తెలుస్తోంది.


డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారని వారి నుంచి పెద్ద ఎత్తున కుకెన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. అయితే ఈ కేసులో ఇద్దరమ్మాయిలతో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసన సైతం నమోదు చేశారు.. ఇప్పటికే డ్రగ్స్ కేసులో మోడల్ లిపి గణేష్, టాలీవుడ్ నిర్మాత ఇలా వరుస పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్లో క్రిష్ పేరును పోలీసులు చేర్చడం కూడా జరిగిందట.ఎఫ్ఐఆర్ లో ఎనిమిదో నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చారు.. పార్టీ జరుగుతున్న సమయంలో హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ హోటల్ అధినేతతో అరగంట పాటు కూడా కూర్చున్నారని రాడిసన్ యజమాని వివేకానందుతో ఆయన మాట్లాడినట్లుగా పోలీసులు తెలిపారు.. ఈ కేస్ పై క్రిష్ స్పందిస్తూ.. తాను హోటల్కు వెళ్లడం నిజమేనని సాయంత్రం ఒక అరగంట మాత్రమే అక్కడ ఉన్నానని ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు.. మళ్లీ తిరిగి ఆరు గంటల 45 నిమిషాలకు తాను ఆ హోటల్ నుంచి కూడా బయటికి వచ్చేసానని అప్పుడే ఆ హోటల్ వివేకానంద తో పరిచయం ఏర్పడింది అంటూ వెల్లడించారు డ్రైవర్ రాలేకపోవడంతో కొద్దిసేపు మాట్లాడామంటే తెలిపారు.. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తాను చెప్పానంటే క్రిష్ తెలిపారు. దీనిపైన ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నారని వెల్లడించారు.. డ్రగ్స్ కేసుతో తనకి ఏమి సంబంధం లేదని స్పష్టం కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: