సమాజంలో స్త్రీ లపై జరిగే ఆకృత్యాలపై దర్శకుడు కృష్ణ వంశీ చాలా సంవత్సరా ల క్రితం రాఖీ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించగా ... గోవా బ్యూటీ ఇలియానా , మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఛార్మి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడి గా నటించారు. ఇకపోతే మహిళలపై జరిగే ఆకృత్యాలపై రూపొందించిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేసింది.

అలాగే ఈ మూవీ లోని ఎన్టీఆర్ నటనకు , అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కృష్ణ వంశీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే కృష్ణ వంశీ ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన రాఖీ ప్రస్తావన రాకుండా ఉండదు. మళ్ళీ రాఖీ లాంటి మూవీ తీయండి సార్ .. రాఖీ కి పార్ట్ 2 తీయండి సార్ అని అనేక ప్రశ్నలను కృష్ణ వంశీ ని అభిమానులు అడుగుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఓ అభిమాని జూనియర్ ఎన్టీఆర్ తో రాఖీ పార్ట్ 2 తీయండి అని కృష్ణ వంశీ ని అడిగాడు. దానికి కృష్ణ వంశీ స్పందిస్తూ ... ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్టార్. అతనితో ఈ సబ్జెక్టు అంత కరెక్ట్ కాదేమో. రాఖీ ని ఓ లేడీ తో సరికొత్తగా తెరకెక్కించాలి అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథ పనులు జరుగుతున్నాయి. అన్ని సెట్ అయితే ఒక అమ్మాయి తో రాఖీ లాంటి సినిమా చేస్తాను అని కృష్ణ వంశీ తెలియజేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kv