నిర్మాతగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఏఎం రత్నం ఒకరు. ఈయన కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" సినిమాను త్వరగా పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ సినిమాను మొదలు పెట్టాడు. దానితో క్రిష్ కూడా పవన్ చేస్తున్న సినిమా పూర్తి చేసే లోపు కొండపొలం మూవీ ని పూర్తి చేశాడు.

ఇలా హీరో , దర్శకుడు వేరే సినిమాలు పూర్తి చేయడంతో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కొంత కాలం పాటు వాయిదా పడింది. మళ్లీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. కాకపోతే పవన్ మళ్లీ రాజకీయాల పనులతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది. కొంత కాలం క్రితం క్రిష్ , అనుష్క తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు రావడంతో ఇక హరిహర వీరమల్లు మూవీ మొత్తంగా ఆగిపోయినట్లే అని వార్తలు వచ్చాయి. దీనితో ఈ సినిమా నిర్మాత రత్నం కచ్చితంగా హరిహర వీరమల్లు మూవీ ఉంటుంది. త్వరలోనే విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు.

ఇకపోతే తాజాగా ఈ నిర్మాత మాట్లాడుతూ ... హరిహర వీరమల్లు మూవీ ఆగిపోయింది అంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. పవన్ తో ఏదో ఒక సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. మా ఇద్దరి కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాను నిర్మిస్తున్న... అందుకే ఈ మూవీ నీ జాగ్రత్తగా రూపొందిస్తున్నాం. ఆ కారణం తోనే ఈ సినిమా లేట్ అవుతుంది అని హరిహర వీరమల్లు మూవీ నిర్మాత చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: