మంగళవారం ఎంత మంచి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ప్రియదర్శి, చైతన్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. గత సంవత్సరం నవంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌తో ప్రయోగాత్మకంగా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆకట్టుకునే ట్విస్టులు, అదిరిపోయే సంగీతం, కెమెరా పనితనంతో ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌ను ఎంతగానో మెప్పించింది.థియేటర్లలో హిట్టైన ఈ సినిమా ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా మంగళవారం సినిమా రికార్డ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. అలాగే బుల్లితెరపై 8.3 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది. ఎలాంటి పెద్ద నటుడు లేకపోయినా విడుదలయిన మూడు ఫార్మాట్ లలో కూడా మంగళవారం సినిమా చాలా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది.ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 మూవీతోనే పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 


బోల్డ్ క్యారెక్టర్‌తో తొలి అడుగులోనే యూత్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. మళ్లీ ఆ స్థాయి సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూసిన పాయల్ నిరీక్షణకు మంగళవారం మూవీతో తెరపడింది. పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ పాత్రలు మాత్రమే చేయగలదనే ముద్రను చెరిపివేస్తూ ఆమెలోని యాక్టింగ్ కోణాన్ని మంగళవారం మూవీలో దర్శకుడు అజయ్ భూపతి చాలా అద్భుతంగా చూపించారు. సెక్సువల్ డిజార్డర్‌తో బాధపడే యువతిగా పాయల్ రాజ్‌పుత్ నట విశ్వరూపం చూపించింది. ఆమె యాక్టింగ్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి.ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి తొలి సినిమాతోనే పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత శర్వానంద్‌, సిద్ధార్థ్‌లతో మహా సముద్రం సినిమా చేశారు.భారీ అంచనాలతో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కిన అజయ్ భూపతి ఓ స్టార్ హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన నెక్స్ట్ మూవీపై క్లారిటీ రానున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: