పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ పవన్ తన సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు. ప్రజెంట్ ఎన్నికలపై దృష్టి సారిస్తూ రాజకీయ సమావేశాలతో బిజీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ తాజాగా ఓ యాడ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకోసం భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు తప్పితే యాడ్స్ లో పెద్దగా నటించింది లేదు.

అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి, రెండు యాడ్స్ లో కనిపించాడు. ఆ తర్వాత ఇప్పటిదాకా వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఓ హెల్త్ యాప్ కి సంబంధించిన యాడ్ లో పవన్ నటించేందుకు ఓకే చెప్పారట. ఇందుకోసం రెండు రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు రోజుల కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ అమౌంట్ ఎక్కువేం కాదు. ఆయన ఒక్క రోజుకి రెండు కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారు. అలా చూసుకుంటే రెండు రోజుల కోసం ఐదు కోట్లు అనేది ప్రాఫిటబుల్ అమౌంట్ అనే చెప్పాలి.

ఇది హెల్త్ కి సంబంధించిన యాడ్ కాబట్టి పవన్ కి ఈ యాడ్ పొలిటికల్ గాను హెల్ప్ అవుతుంది. దాంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. గతంలో ఇలాగే చిరంజీవి సాఫ్ట్ డ్రింక్స్ కి సంబంధించిన యాడ్స్ లో నటించి ఇబ్బందుల పాలయ్యాడు. సో పవన్ కళ్యాణ్ కూడా హెల్త్ కు సంబంధించిన యాడ్లో నటిస్తుండడంతో ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: