సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తప్పితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండున్నరేళ్లు దాటిపోయింది. అయినా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి రైటర్ సాయి మాధవ్ బుర్ర తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గేమ్ చేంజర్ సినిమాకి తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుంటే సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 'గేమ్ చేంజర్' గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు సాయి మాధవ్ బుర్ర ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." గేమ్ చేంజర్ అనేది అద్భుతమైన సినిమా.. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇది సామాన్యమైన సినిమా కాదు. సినిమాలోని ప్రతి సీన్, ప్రతి షాట్ మనల్ని ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తోంది. rrr సినిమా ఆ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కర్ని ఎలా నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లిందో.. గేమ్ ఛేంజర్ కూడా ఆ మూవీ యూనిట్ లోని ప్రతి ఒక్కరిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అన్నారు. ఇక సినిమాలో రామ్ చరణ్ లుక్స్ గురించి చెబుతూ.. సినిమాలో రామ్ చరణ్ మాస్ గా ఉంటాడు, క్లాసు గా ఉంటాడు,

హుందాగా ఉంటాడు, రగ్గుడ్ గా ఉంటాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో, అని వేరియేషన్స్ లో ఉంటాడని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో సాయి మాధవ్ బుర్రా చేసిన కామెంట్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: