టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో నింగికెగిసిన తారలు, మరికొందరు ఆరు పదులు వచ్చినా సరే తగ్గేదెలే అంటూ వయసు శరీరానికే తప్పా..నటనకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. తమ నటనతో వందల, వేల అనేక హిట్ చిత్రాల్లో నటించిన వారిలో ఎందరో ఉన్నారు. నటనలో మేమేమన్నా తక్కువనా అంటూ ఆ తరం ఆడియెన్స్ నే కాదు, ఈ తరం ఆడియెన్స్ ని సైతం తమ నటనతో ఇరగదీస్తున్నారు సీనియర్ నటులు. అలాంటి సీనియర్ నటుల్లో ఒకరు నటి డబ్బింగ్ జానకి. ఆమె తన నటించిన మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. వెయ్యికి పైగా సినిమాలలో నటించానని, ఒక్కో టైంలో తినడానికి తిండి లేక నూకలు పిల్లలకు పెట్టిన సందర్బాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన గత స్మృతులను పంచుకున్నారు . తాజాగా సీనియర్ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ జానకీ కాళ్లని కమల్ హాసన్ పట్టుకున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా ఇండస్ట్రీలో సావిత్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె వేసిన పాత్రలు తనకు ఎంతగానో నచ్చుతాయని తెలిపారు. ఇతరుల దగ్గర ఏమీ లేనట్టు నిలబడకూడదని భావించేవాళ్లమని డబ్బింగ్ జానకీ కామెంట్లు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరినీ అప్పు అడగకూడదని భావించానని ఆమె పేర్కొన్నారు. నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ గా ఎవరు లేరని నా కష్టంతో నేను ఎదిగానని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్స్ ఇళ్లకు వెళ్లి ఛాన్స్ అడిగేదానినని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తనకు ఇండస్ట్రీలో ఎవరూ కూడా సపోర్ట్ గా లేరని, నేను ఎవరితో సరదాగా ఉండనని.. నా పని నేను చూసుకుంటానని డబ్బింగ్ జానకి అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం. నా కష్టంతో నేను ఎదిగానని ఆమెకు జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చారు.దర్శకుడు కే. విశ్వానాథ్ గారితో 17 సినిమాలు చేశానని అన్నారు. ఇక ఆమె నటించిన సాగర సంగమం సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఆ మూవీలో ఒక సీన్ కోసం కమల్ హాసన్ కాళ్ల మీద పడి ఏడ్చానని ఆ సమయంలో కొంతమంది కమల్ ఆమె కాళ్ల మీద పడటం ఏంటని అన్నారని జానకీ చెప్పుకొచ్చారు. కొంతమందికి ఇగోస్ అడ్డు వస్తాయని, కానీ కమల్ మాత్రం ఆ సీన్ ను సీన్ లా చేసి అందరిని ఆకట్టుకున్నారని డబ్బింగ్ జానకి వెల్లడించారు. సీన్ లో పాల్గొంటున్నామంటే అక్కడ కమల్, డబ్బింగ్ జానకి కాదని అందులో ఉండే పాత్రలు మాత్రమే ఉంటాయని ఆమె అన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ జానకి తెలిపిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: