వైష్ణవి చైతన్య అంటే మనకు గుర్తుకువచ్చేది బేబీ మూవీలో హీరోయిన్. తన అందం అభినయం తో అందరినీ ఆకట్టుకుంది. సినిమా నీ మరవక ముందే తను ఇంకో సినిమా తో అందరినీ ఆకట్టుకో బోతోంది.ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
'లవ్‌ మీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. 'ఇఫ్ యూ డేర్‌' అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ ప్రకటించిన అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ 'తిరుమలలో ఉండడంతో ఆశిష్‌ ఇక్కడకు రాలేకపోయాడు. ఇక నాగ, అరుణ్‌ ఈ స్టోరీ వినిపించగానే ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. 'ఆర్య' కథ విన్నప్పుడు ఎంతలా ఎగ్జయిట్ అయ్యానో అలా ఫీలయ్యాను.ఇదొక న్యూ ఏజ్ సినిమా. స్క్రిప్ట్ పూర్తయ్యాక కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి టెక్నీషియన్స్ పేర్లు చెప్పడంతో భయమేసింది. స్క్రిప్ట్‌ నచ్చి వాళ్లిద్దరూ ఓకే చెప్పారు. హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే 'బేబీ' హిట్ అయ్యింది. వైష్ణవి కూడా వెంటనే ఓకే చెప్పింది. అలా స్క్రిప్ట్‌ స్థాయిలో ఎగ్జయిట్ చేసే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయబోతున్నాం' అన్నారు.వైష్ణవి చైతన్య మాట్లాడుతూ 'ఇలాంటి కాన్సెప్ట్‌, స్టోరీ లైన్‌ను ఇదివరకెప్పుడూ చూడలేదు. త్వరలో రాబోతున్న టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమా అవుతుంది' అని చెప్పింది. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, దర్శకుడు అరుణ్ భీమవరపు పాల్గొన్నారు.ఇదొక న్యూ ఏజ్ సినిమా. స్క్రిప్ట్ పూర్తయ్యాక కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి టెక్నీషియన్స్ పేర్లు చెప్పడంతో భయమేసింది. స్క్రిప్ట్‌ నచ్చి వాళ్లిద్దరూ ఓకే చెప్పారు. హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే 'బేబీ' హిట్ అయ్యింది. వైష్ణవి కూడా వెంటనే ఓకే చెప్పింది. అలా స్క్రిప్ట్‌ స్థాయిలో ఎగ్జయిట్ చేసే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయబోతున్నాం' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: