హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నా.. హీరోయిన్ గా కెరీర్ మాత్రం చాలా చిన్నది. మరి కెరీర్ మసకబారిన తర్వాత సదరు హీరో యిన్ ఏం చేయాలి? ఈ విషయం లో హీరోయి న్లందరికీ ప్లాన్-బి ఉండా లంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్.జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయం లో ఇప్పటికే తోటి హీరోయి న్లకు సలహాలు-సూచనలు అందించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరో యిన్ల బ్యాకప్ ప్లాన్స్ పై స్పందించింది. హీరోయిన్ గా కెరీర్ కొనసా గిస్తున్న టైమ్ లోనే ఇష్ట మైన రంగంపై దృష్టి సారించాలని కాజల్ అగర్వాల్ చెబుతుంది.అది ఏ రంగంమైనా మనసుకు నచ్చినదై ఉండాలంటోంది కాజల్. ఇక తన విషయానికొస్తే.. నటించడం తగ్గించిన తర్వాత హోటల్ బిజినెస్ లో వెళ్లే ఆలోచన లో ఉన్నట్టు కాజల్ అగర్వాల్ వెల్లడించింది. "హోటల్ బిజినెస్ లో నేను స్ట్రాంగ్. కాబట్టి భవిష్యత్తులో బిజినెస్ చేస్తే మాత్రం.. కచ్చితంగా హోటల్ బిజినెస్ చేస్తానేమో అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ సినీ నిర్మాణం పై కూడా మాట్లా డుతూ.. సినీ నిర్మాణం చాలా కష్టం. సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందుకే, నేను హోటల్ బిజినెస్ తప్ప, సినిమా నిర్మాణం మాత్రం చేయను' అని కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.కాజల్ అగర్వాల్ ఇంకా మాట్లా డుతూ మా వారు గౌతమ్ కి కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. అవసరం అయితే, మా వారి బిజినెస్ లెక్కలు చూసుకోగలను. కచ్చితంగా సినిమా రంగం లోనే  ఎంచు కోమని అడిగితే మాత్రం.. యాక్టింగ్ స్కూల్ ను నేను సెలక్ట్ చేసు కుంటాను, మొత్తానికి ఇలా బిజినెస్ రంగంపై తనకు ఉన్న అభిరుచిని పరోక్షంగా వెల్లడించింది కాజల్. అన్నట్టు కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమా ల్లో నటించ డానికి కసరత్తులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: