ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు అలాగే డైరెక్టర్స్, ప్రోడ్యుసర్స్ పెళ్ళిబాట పడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు బాలీవుడి నటుడు, నిర్మాతను పెళ్లాడిన సంగతి తెలిసిందే.అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు, నటుడు ఆశీష్ రెడ్డి సైతం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్పీ వంతు వచ్చింది. తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. తాప్పీ ప్రియుడు మథియాస్ వివరాల్లోకి వెళ్తే.. ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్.ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది. ఈ ముద్దుగుమ్మ కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల నడుమ తన ప్రియుడ్ని పెళ్లాడనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్ళికి సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం లేనట్టే తెలుస్తుంది.దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది . అయితే త్వరలోనే తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మార్చి 27వ తేదీ ఉదయపూర్ లో అట్టహాసంగా వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ సినీ ప్రముఖులు సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారట . వీరిద్దరి వివాహం సిక్కు - క్రైస్తవ సాంప్రదాయంలో జరగబోతుంది అంటూ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: