రవితేజ ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' షూటింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్ ని కరైకుడిలో ప్లాన్ చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' చిత్రానికి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అక్కినేని అఖిల్ 'ఏజెంట్' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ 'గాండీవ దారి అర్జున'లో నటించింది. ఆ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. టాలీవుడ్ లో ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న కూడా ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ - అనుదీప్ కాంబో మూవీలో సాక్షి వైద్య హీరయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా సాక్షి వైద్య సైన్ చేసిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం అందులో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమాలో రవితేజ సరసన 'సప్త సాగరాలు దాటి' మూవీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా సాక్షి వైద్య తెలుగులో ఇప్పటికే శర్వానంద్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు తో 'సామజవరగమన' లాంటి సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేస్తున్నారు.

'జాతి రత్నాలు' తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాడు డైరెక్టర్ అనుదీప్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్' అనే సినిమా చేశాడు. అయితే ఆ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఈసారి రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేశారట. రవితేజ సైతం ఈ మూవీ కోసం ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుందట.మరింత సమాచారం తెలుసుకోండి: