'పుష్ప 2' సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ బండారి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.'పుష్ప 2' బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ షూట్ చేశారట. సినిమాలో ఇంటర్ వెల్ బ్యాంగ్ లో వచ్చే ఆ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం.

'పుష్ప2' జాతర ఎపిసోడ్ దాదాపు అరగంట సేపు ఉంటుంది. ఇందుకోసం మూవీ టీమ్ దాదాపు 35 రోజుల పాటు పని చేసింది. ఈ ఎపిసోడ్ కోసమే నిర్మాతలు రూ.50 కోట్లకుపైనే ఖర్చు చేసినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ జాతర ఎపిసోడ్లో బన్నీ అర్ధనారీశ్వరుడి గెటప్ లో కనిపిస్తాడట. చేతులకు నెయిల్ పాలీష్‌, నుదుట బొట్టుతో ఇప్పటికే రిలీజ్ చేసిన బన్నీ లుక్ ఈ ఎపిసోడ్ లోనే ఉంటుందని అంటున్నారు. ఓ పాట, భారీ ఫైట్, సెంటిమెంట్ ని మేళవించి సుకుమార్ ఈ ఎపిసోడ్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇదే ఎపిసోడ్లో ఓ కీలక ట్విస్ట్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఉంటుందట.

 'పుష్ప 2' సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ హైలెట్ కానుందని సమాచారం. థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ కి పూనకాలు గ్యారెంటీ అని చెబుతున్నారు.ఇటీవల జరిగిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న బన్నీ 'పుష్ప 3' పై అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాని ఫ్రాంచైజీగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. "పుష్ప 3ని కచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే, మేం 'పుష్ప'ను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. సీక్వెల్స్ కోసం మా దగ్గర చక్కటి ఆలోచనలున్నాయి. 'పుష్ప3' ఆశించడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు" అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: