హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కుర్రాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆమె కోరుకున్న ఒక బహుమతి ఇస్తే నేను మీ సొంతం అవుతాను అంటుంది. ఇంతకీ అనుపమ ఏం అడిగింది చూద్దాం.హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య పంథా మార్చింది. శృంగార సన్నివేశాలు చేస్తూ రచ్చ లేపుతుంది. 'అ ఆ' మూవీతో తెలుగులో అడుపెట్టిన అనుపమ... ప్రేమమ్, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ క్యూట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి అనుపమ రౌడీ బాయ్స్ మూవీతో గ్లామర్ యాంగిల్ తీసుకుంది. లిప్ కిస్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది.ఇక టిల్లు స్క్వేర్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హీరో సిద్ధూ జొన్నలగడ్డతో లెక్కకు మించిన లిప్ లాక్ సీన్స్ చేసింది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూశాక... అనుపమ పరమేశ్వరన్ రోల్ పై క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ కి ఆమె ఊహించని ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైందని అర్థం అవుతుంది. టిల్లు స్క్వేర్ మార్చి 29న గ్రాండ్ గా విడుదల కానుంది.28 ఏళ్ల అనుపమ కుర్రాళ్లకు ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఆమె కోరిన బహుమతి ఎవరైతే ఇస్తారో వాళ్ళ సొంతం అవుతానని ఓపెన్ గా చెప్పింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ అడిగిన గిఫ్ట్ ఏమిటంటే... బేబీ హిప్పో. కారణం తెలియదు కానీ... బేబీ హిప్పో మీద అనుపమ మనసు పారేసుకుంది. దాన్ని ఎవరైతే తనకు ఇస్తారో వాళ్ళకు దగ్గర అవుతుందట.

అనుపమ పరమేశ్వరన్ ఆఫర్ బాగున్నప్పటికీ చాలా డేంజరస్. అడవి ప్రాణులను చంపడం, పెంచుకోవడం మన దేశంలో నేరం. అలా చేయాలి అనుకుంటే ప్రత్యేక అనుమతులు తప్పవు. అత్యంత అరుదైన జీవుల్లో ఒకటైన హిప్పోని తీసుకొచ్చి అనుపమకు బహుమతిగా ఇవ్వడం కష్టమైన పనే...మరి అనుపమ కోసం ఎవరైనా రిస్క్ చేస్తారేమో చూడాలి. మరోవైపు అనుపమ టిల్లు స్క్వేర్ మూవీతో పాటు ఓ మలయాళ చిత్రం చేస్తుంది. అనుపమ కెరీర్ పర్లేదు అన్నట్లుగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: