మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి విజయాలను కూడా అందుకున్న సినిమాలు ఉన్నాయి.. అలాంటి సినిమాలలో ప్రేమలు ఒకటి సినిమా కూడా ఒకటి.. ఇటీవల ఈ సినిమా విడుదలై సూపర్ హిట్టుగా దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మమిత బైజు పైన సినిమా చూసిన నెటిజెన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో చక్కని నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా మమిత బైజు దర్శకుడు పైన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక పేరున్న  డైరెక్టర్ తాననీ తిట్టాడని అంతేకాకుండా తన పైన చేయి చేసుకున్నాడంటూ కూడా వెల్లడించింది.. హీరోయిన్ మమిత బైజు పైన చేయి చేసుకున్న డైరెక్టర్ మరెవరో కాదు తమిళంలో ఒక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ బాల.. ఈ ముద్దుగుమ్మ ప్రేమలు సినిమా కంటే ముందుగా వణంగాన్ అనే చిత్రంలో నటించిందట.ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి ఆమె బయటికి రావడంతో ఆ సినిమా సమయంలో డైరెక్టర్ బాల తనని తిట్టాడని అంతటితో ఆగకుండా కొట్టారంటూ కూడా తెలియజేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఈ విషయాలను తెలియజేసింది.


వణంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఒక సంగీత పరికరాన్ని సైతం వాయించే సన్నివేశాలు చేయాలని అయితే నేను అనుభవం కలిగిన కళాకారునిగా నటించాలా లేదా మొదటిసారి నేర్చుకుంటున్నా అమ్మాయిగా నటించాలనే విషయం పైన డైరెక్టర్ సైతం అడిగానని.. అందుకు డైరెక్టర్ నువ్వు అనుభవం ఉన్న కళాకారునిగా నటించాలని చెప్పారట.. డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిల పాట పాడాలనుకున్నానని ఇంతలో కుర్చీ వెనకాల నుంచి అమ్మాయిని చూపించి అలా పాడాలంటూ తెలిపారుట. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను వాళ్ళు ఏం పాడుతున్నారు తనకి అర్థం కావడం లేదని దీంతో ఎక్కువ టేక్స్ తీసుకున్ననని అప్పటికే ఆయన తనని తిడుతున్నారని అయినప్పటికీ తాను అవీ పట్టించుకోలేదని చివరికి తనని కొడుతూ ఉన్నారని.. ఇదంతా సూర్య సార్ చూసి తనకు చెప్పారని వెల్లడించింది. అయితే ఆ తర్వాత సూర్య గారు కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: