నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా డెవిల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ ని అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మించాడు. ఇకపోతే ఈయన ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈటీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 10 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

kr