ఒకప్పుడు హీరో హీరోయిన్లు పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను పెద్దగా బయటికి పంచుకునేందుకు ఇష్టపడేవారు కాదు. ఎలాంటి విషయాన్ని అయినా సరే సీక్రెట్ గానే పెట్టుకునేవారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఎదురైన చేదు అనుభవాలను కూడా మనసులోని దాచుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా అన్ని విషయాలను బహిరంగంగా చెప్పేస్తూ ఉన్నారు. కెరియర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను.. ఇక షూటింగ్ సెట్లో ఎదురైనా వేధింపులను కూడా సోషల్ మీడియాలో అభిమానులుతో పంచుకోవటం  చేస్తున్నారు. దీంతో ఎవరైనా హీరోయిన్ ఇలాంటివి సోషల్ మీడియాలో చెప్పింది అంటే చాలు అది సంచలనంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ గురించి ఓ హీరోయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ సెట్లో ఉన్న సమయంలో ఏకంగా డైరెక్టర్ తనపై అరిచాడు అంటూ వ్యాఖ్యలు చేసింది. అదేంటి సరిగ్గా నటించకపోతే ఎవరైనా డైరెక్టర్ కాస్త చిరాకులో అరవడం చేస్తాడు. దాంట్లో తప్పేముంది అంటారా? అరవడమే కాదు ఏకంగా తనపై చేయి కూడా చేసుకున్నాడు అంటూ చెబుతుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలోనే సదరు హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇంతకీ స్టార్ డైరెక్టర్ పై ఇలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు మమిత బైజు.


 కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న బాలాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఈ మలయాళ హీరోయిన్. బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  వంగాలాన్ అనే సినిమాలో తొలితా సూర్య, మమితను హీరో హీరోయిన్లుగా ఖరారు చేశారు మేకర్స్. అయితే ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో తెలియదు. కానీ సూర్యమూవీ నుండి తప్పుకున్నారు. అయితే సూర్య తర్వాత హీరోయిన్ మమితా కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ లో డైరెక్టర్ తనను తిట్టడంతో పాటు కొట్టాడు అంటూ డైరెక్టర్ ఫై మమిత బైజు సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఆమె చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్. కాగా వాడు వీడు సినిమాతో కోలీవుడ్ లో తెగ పాపులర్ అయ్యాడు డైరెక్టర్ బాల.

మరింత సమాచారం తెలుసుకోండి: