ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ గా హవా నడిపిస్తున్న అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా బన్నీకి లేడీస్ లో అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి అల్లు అర్జున్ కలవాలని.. ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగాలని అనుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కూడా ఎప్పుడు అభిమానులకు ఎంతో గౌరవం ఇస్తూ ఇక వారితో కాస్త సమయం గడపడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా అల్లు అర్జున్ ఒక్కసారైనా కలవాలి అనుకునే వారిలో సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు ఏకంగా సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు అని చెప్పాలి.


 ఏకంగా ఎంతో మంది హీరోలు సైతం అల్లు అర్జున్ తో ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా సెలబ్రిటీల వారసులు కూడా అల్లు అర్జున్ తో ఒక్క ఫోటో దిగి అవకాశం వస్తుందేమో అని చాలా రోజులుగా వేచి చూడటం చేస్తూ ఉంటారు.  ఇక ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఒక హీరో కూతురు కూడా అల్లు అర్జున్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు కిచ్చా సుదీప్. అయితే సుదీప్ కూతురు శాన్వి ఏకంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి ఒక పెద్ద వీరాభిమాని అంటూ చెప్పుకొచ్చింది.


అల్లుఅర్జున్ ని ఒక్కసారైనా కలిసి ఆయనతో ఫోటో దిగి అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తున్నాను. ఇక ఆయనతో పని చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఉండదు అంటూ తన అభిమానాన్ని చెప్పుకొచ్చింది. కాగా శాన్వి తండ్రిలా నటనవైపు అడుగులు వేయకుండా సింగర్ గా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొని.. పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: