తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వెంకటేష్ ఇప్పటికే తనకు రెండు విజయాలను అందించినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించబోతుంది. అంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించే అవకాశం దాదాపుగా లేదు అని తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా ఎవరు నటిస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ కి ఈ సినిమా బృందం ఓ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి చిత్ర బృందం "సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నిర్మాతలు సంక్రాంతి కి వస్తున్నాం అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం.

ఈ టైటిల్ ను ఈ సినిమా కోసమే చేశారు అని మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే వెంకటేష్ కొంత కాలం క్రితమే సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా సన్దవ్ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోవడంతో వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: