దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఈ మూవీ బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఆ మధ్యలో ఒక సారి దిల్ రాజు ఈ సినిమాని 2024 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాలేదు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ మరో రెండు , మూడు నెలలు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో రెండు , మూడు నెలలలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలువడే ఛాన్స్ ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rc