తమిళ సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో బాల ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఈయన తన కెరియర్ లో ఎప్పుడు కమర్షియల్ సినిమాల జోలికి పోలేదు. ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. ఇలా కెరియర్ ప్రారంభంలో ఈయన ఎన్నో విజయాలను అందుకున్నాడు. 

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన తెరకెక్కించిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావితం చూపడం లేదు. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు సూర్య హీరో గా మమిత హీరోయిన్ గా "వనంగన్" సినిమాను మొదలు పెట్టాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నాడు. ఆ తర్వాత మమతా కూడా ఈ మూవీ నుండి తప్పుకుంది. ఇకపోతే తాజాగా మమత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా బాల పై మరియు "వనంగన్" సినిమా నుండి ఎందుకు తప్పకుంది అనే దానిపై క్లారిటీ ఇచ్చింది.

ఇంటర్వ్యూ లో భాగంగా మమతా మాట్లాడుతూ ... బాల గారి దర్శకత్వంలో సూర్య హీరో గా నేను హీరోయిన్ గా "వనంగన్" అనే సినిమా మొదలు అయింది. కొంత భాగం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుండి సూర్య తప్పకున్నాడు. ఆ తర్వాత నేను కూడా తప్పుకున్నాను. ఇకపోతే ఆ మూవీ షూటింగ్ సమయంలో సెట్స్ లో డైరెక్టర్ తనను తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకున్నాడు అని ఈ ముద్దు గుమ్మ తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఇక తాజాగా మమతా ... బాల పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: