యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడి గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండగా ... మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది.

అందులో మొదటి భాగాన్ని ముందుగా ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే అప్పటి వరకు ఈ సినిమా మొదటి భాగం పనులు పూర్తి కావు అనే నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ లో ఆయుధ పూజా సన్నివేశంలో ఓ సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఈ సాంగ్ ని అదిరిపోయే రేంజ్ లో చిత్రీకరించాలి అనే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: