టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ నటి మానులలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక సినిమాలలో నటించింది. అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా అందుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటించింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... చినబాబు , సూర్య దేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మకు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈమె కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ... ఈ బ్యూటీ కి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తప్పు ఏమీ లేదు అని నిర్మాతలు డిసైడ్ అవ్వడంతో ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తూ సినిమాలను ఓకే చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం శ్రీ లీల ఒక్కో మూవీ కి దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ... ఒక వేళ సినిమా కథ గనుక అద్భుతంగా నచ్చిన ... ఆ సినిమాకు చాలా తక్కువ తేదీలను ఇవ్వాల్సి వచ్చిన సినిమాకు ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: