టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా క్రిష్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. నాలుగేళ్ల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు.ఈ సినిమా షూటింగ్ సరిగ్గా జరుపుకోక వాయిదాల మీద వాయిదా పడుతూ ఉంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు.పవన్ కళ్యాణ్ తన పూర్తి ఫోకస్ అంతా ఆంధ్రా ఎలక్షన్స్ మీద పెట్టడంతో వీరమల్లు సినిమాకు టైం ఇవ్వలేకపోతున్నాడు.ఈ సినిమా పై ఫ్యాన్స్ చాలా అంటే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అసలు ఈ సినిమా వస్తుందా రాదా అన్న కన్ ఫ్యూజన్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే. సినిమా ఏకంగా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని చెప్పి షాక్ ఇచ్చాడు నిర్మాత ఏ.ఎం రత్నం. హరి హర వీరమల్లు సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు.


సినిమా ఎంత లేట్ అవుతున్నా తనకు ఎలాంటి ఇబ్బంది లెదన్నట్టుగా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది.ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ ఇన్ ఫర్మేషన్ చెప్పాడు నిర్మాత రత్నం. వీరమల్లు సినిమా మొత్తం రెండు భాగాలుగా వస్తుందని.. సినిమా మీ అందరి అంచనాలకు మించి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. క్రిష్ డైరెక్షన్ లో 17వ శతాబ్ధం నాటి కథతో హరి హర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ బందిపోటు దొంగగా కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.హరి హర వీరమల్లు పార్ట్ 1 సినిమాని 2025 సంక్రాంతికి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి ఈ సినిమా అప్పటికైనా వస్తుందో రాదో చూడాలి. ఈ సినిమా  మూడేళ్ల తరువాత స్టార్ట్ చేసిన ఓజీ సినిమా కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ హరి హర వీరమల్లు మాత్రం చాలా అంటే చాలా లేటు అవ్వడం ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. అందుకే ఫ్యాన్స్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా నమ్మకాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: