తెలుగు సినిమా పరిశ్రమ లో శ్రేయ అంటే తెలియని వారుం డరు.తన మొదటి సినిమా తోనే అభిమానులను,తన అందంతో,అభినయం తో అందరినీ కట్టి పడేసింది. యిటి వల తను సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు చాలా బాధప టినట్టు తెలు స్తుంది.సోషల్‌ మీడియా వచ్చాక ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మరింత ఈజీ అయిపోయింది. సెలబ్రిటీలనయితే ఇష్టమొచ్చినట్లు అనేస్తున్నారు. నచ్చితేనేమో దేవతలా ఉన్నావని, నచ్చకపోతే చెండాలంగా ఉన్నావ్‌, దరిద్రంగా ఉన్నావ్‌..ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటి? ఇలా నానామాటలు అంటున్నారు. టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియకు సైతం ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవు తున్నాయట! ఒక బిడ్డ కు తల్లయినా కూడా తనను ఇప్పటికీ జడ్జ్‌ చేస్తున్నారని భావోద్వేగానికి లోనైంది.మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్‌.'ఇండస్ట్రీలోని మహిళా నటులను, హీరోయిన్లను పనికిమాలిన వ్యక్తులు గా చూస్తారు. ఇప్పటికీ ఇది జరుగు తూనే ఉంది. కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోయేందుకు నేను నా పాత స్నేహితుల దగ్గరికి వెళ్లిపోయి వారితో సంతోషంగా గడుపుతాను. నా భర్త చూసి.. నువ్వు మరీ ఎక్కువ గా ఆలోచి స్తున్నావు. మరీ ఇంతలా ఎవరూ ఆలోచించరేమో అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ ఆ కామెంట్స్‌ చూసి నప్పుడు ఫీల్‌ అవకుండా ఉండలేం. ఇప్పుడు నేను ఒక తల్లిని.నా గురించి నాకు తెలుసు..నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కూడా జనాలు నన్ను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. నాకేది ఇష్టమైతే అదే ధరిస్తాను. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీ లో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎలా చూస్తున్నారు? అనేది వారి సమస్య.. నాది కాదు!' అని చెప్పుకొచ్చింది. కాగా శ్రియ ప్రస్తుతం 'షో టైమ్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌ హాట్‌ స్టార్‌లో మార్చి 8 నుంచి ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: