టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందిన సందీప్ రెడ్డి వంగ ఇటీవలే బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు.. అయితే గత కొన్ని నెలలుగా ప్రభాస్ తో కలిసి స్పిరిట్ అనే సినిమాని చేయబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇంకా అధికారికంగా షూటింగ్ అయితే ప్రారంభించలేదు.. కానీ స్పిరిట్ అనే టైటిల్ మాత్రమే ఫిక్స్ చేశారు.. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం అయితే వైరల్ గా మారుతూ ఉంటుంది.


స్పిరిట్ సినిమా ఒక హర్రర్ సినిమా అని ఇందులో ప్రభాస్ మాంత్రికుడుగా కనిపించబోతున్నారని రూమర్స్ అయితే వినిపించాయి.. తాజాగా ఇ రూముర్స్ అన్నిటికీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెక్ పెట్టడం జరిగింది. ఒక బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ స్పిరిట్ సినిమా స్టోరీ లైన్ ని తెలియజేశారట. ప్రభాస్ తో తెరకెక్కించబోతున్న సినిమా పాన్ ఇండియా ఫిలిం అని అందుకే ఈ సినిమా పనులలో కాస్త బిజీగా ఉన్నారని తెలిపారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.


త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని వాస్తవానికి ఇది హర్రర్ మూవీ కాదని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కదా అంశంతో తెరకెక్కిస్తున్న సరికొత్త సినిమా అని ప్రభాస్ ని ఇందులో సరికొత్తగా చూస్తారు అంటూ తెలిపారు.. తమ అభిమాన హీరో మొదటిసారి కాకి దుస్తులలో చూపిస్తూ ఉండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898AD మే 9వ తేదీన రిలీజ్ కాబోతోంది, రాజా సాబ్ చిత్రాలలో బిజీగా ఉన్నారు.. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో తెరకెక్కించగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు.. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటించిన బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: