రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ 12th ఫెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాకి చాలా మంచి ప్రేక్షకాధారణ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీల్లో ప్రసారమవడానికి సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 27, 2023న థియేటర్లలో విడుదలైంది. కేవలం మౌత్‌ టాక్ తో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకులు ఫుల్‌ మార్కులు వేశారు.ఆ తర్వాత OTTలోకి అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు '12th ఫెయిల్' టెలివిజన్‌లో ప్రసారమయ్యే టైం వచ్చేసింది. ఈ మూవీలో హీరోగా నటించిన విక్రాంత్ మాస్సే 12th ఫెయిల్ టెలివిజన్ ప్రీమియర్ గురించి అప్డేట్ ఇచ్చాడు.నిరుపేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు ఐపీఎస్ అధికారిగా ఎదిగిన వాస్తవ కథ ఆధారంగా '12th ఫెయిల్' సినిమా తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.


ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లు అలాగే OTTలో ఈ మూవీని మిస్ అయిన వారు ఇప్పుడు టీవీలో చూడటానికి రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 29 గురువారం రాత్రి 8 గంటలకు 'సోనీ మ్యాక్స్' ఛానెల్‌లో ప్రసారం అయ్యింది. థియేటర్లలో, OTTలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా భారీ TRP ని పొందుతుందని అంచనా వేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ మూవీ మంచిTRP దక్కుతుందని తెలుస్తోంది. '12th ఫెయిల్‌' మూవీ బాక్సాఫీస్‌ వద్ద 56.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఇక ఈ సినిమా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 5 అవార్డులను గెలుచుకుంది. విక్రాంత్ మాస్సే నటనను అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. '12th ఫెయిల్‌' తో విజయం సాధించడంతో విక్రాంత్‌ మాస్సే పెద్ద స్టార్‌ హీరో అయిపోయాడు. ఇప్పుడు 'ది సబర్మతి రిపోర్ట్' అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: