టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ పని చేసినా క్షణా ల్లో నెట్టింట వైరల్ అవుతుందనే సంగతి తెలి సిందే. రాజమౌళి త్వ రలో మహేష్ సినిమా పనులను మొదలు పెట్టనుండ గా ఈ సినిమా ఎప్పుడు మొదలవు తుందనే చర్చ అభిమానుల మధ్య జోరు గా జరుగుతోంది.రాజమౌళి కి దైవ భక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమా కు రెమ్యు నరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.తాజాగా రాజమౌళి భార్య తో కలిసి ఒక ఆలయాన్ని దర్శించు కోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. బళ్లారి లో ఉన్న శ్రీ అమృతేశ్వరా ఆలయంలో జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. బళ్లారితో జక్కన్నకు మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.  రాజమౌళి సన్నిహితులు సైతం బళ్లారిలో ఉన్నారు. జక్కన్న ప్రాజెక్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెస్ట్ ఔట్ పుట్ కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. రాజమౌళి తన తర్వాత సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్లను సైతం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు క్రేజ్ కు తగ్గ కథను ఆయన ఎంపిక చేశారని తెలుస్తోంది.  మహేష్ బాబు గతం లో చేసిన టక్కరి దొంగ తరహా గెటప్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ థీమ్ తో నెక్స్ట్ లెవెల్ లో రాజమౌళిసినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బడ్జెట్  రూల్స్ లేకపోవడంతో రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని భోగట్టా. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ల తో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: