బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి వివాహం చేసుకున్న వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న జంటలు కొన్ని మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా మోస్ట్ క్యూట్ కపుల్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న వారిలో.. రణవీర్ సింగ్, దీపిక పదుకొనే జంట కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరి కెరియర్లో వారు బిజీ బిజీగా ఉంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా స్టార్ హీరో హీరోయిన్లు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే చాలు వారు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అవుతారా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో హీరోయిన్లకు సంబంధించిన వారసులు ఈ భూమ్మీదకు రావాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారూ అభిమానులు. అయితే ఇక ఇటీవల అభిమానులకు ఇలాంటి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రణవీర్ సింగ్, దీపిక పదుకొనే జంట. తాము తల్లిదండ్రులను కాబోతున్నాము అంటూ ఇటీవల ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొనే ఇప్పుడు పేరెంట్స్ కానుండడంతో అభిమానులతో పాటు తోటి నటీనటులు అందరూ కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అచ్చం దీపిక పదుకొనే లాంటి ఆడపిల్ల తనకు పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ రణవీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. నేను రోజు దీపిక చిన్ననాటి ఫోటోలను చూస్తూ ఉంటాను. అందులో దీపిక ఏకంగా దేవతలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె లాంటి ఆడపిల్ల నాకు పుట్టాలని కోరుకుంటున్నా. ఇక అలా పుడితే శౌర్య వీర్ సింగ్ అనే పేరు పెట్టుకుంటా అంటూ రణబీర్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: