ఈ రోజు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు అవి విడుదలకు లేకపోయినా కొన్ని పర్వాలేదు అనే రేంజ్ ఉన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి ..? ఆ సినిమాల రన్ టైమ్ మరియు సెన్సార్ వివరాలను తెలుసుకుందాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మార్చి 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ కేవలం రెండు గంటల నాలుగు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు కమీడియన్ గా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వెన్నెల కిషోర్ తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మార్చి 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "యు / ఏ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ రెండు గంటల పది నిమిషాల నడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

భూతద్దం భాస్కర్ నారాయణ ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "యు / ఎ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 21 నిమిషాలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే వీటితో పాటు మరో కొన్ని పెద్దగా క్రేజీ లేని సినిమాలు కూడా ఈ రోజు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలలో ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ , భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలకు సంబంధించిన ప్రీమియర్స్ ను నిన్న రాత్రి ప్రదర్శించారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: