ఇండియాలోని చాలా భాషల్లో రీమేక్ అయిన సినిమాలలో దృశ్యం మూవీ ఒకటి. ఈ మూవీ మొదట మలయాళం లో రూపొందింది. మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి హీరో గా రూపొందిన ఈ సినిమాకు మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి జితు జోసఫ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మీనా , మోహన్ లాల్ కి భార్య పాత్రలో నటించింది. ఇకపోతే మలయాళం లో మొదట విడుదల అయిన ఈ సినిమా అక్కడ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇలా మలయాళం లో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాను వెంకటేష్ హీరో గా మీనా హీరోయిన్ గా తెలుగులో రూపొందించారు. ఈ సినిమా తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. అలాగే దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే దృశ్యం మూవీ కి పార్ట్ 2 కూడా వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన రీతిలో ప్రజాదరణ పొందింది.

ఇకపోతే ఇప్పటికే ఇండియా లోనీ చాలా భాషలలో రీమేక్ అయ్యి అద్భుతమైన విజయం సాధించిన దృశ్యం మూవీ ని మరికొన్ని రోజుల్లో హాలీవుడ్ లో కూడా రీమిక్ చేయబోతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... హాలీవుడ్ కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ మరో సంస్థతో కలిసి ఈ మూవీ ని హాలీవుడ్ లో రీమిక్ చేయనుంది. ఈ మూవీ ని ఇంగ్లీష్ , స్పానిష్ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు సదరు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇలా ఇప్పటికే ఇండియా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: