ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం ఫుల్ క్రేజ్ కలిగిన సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ ఒకటి. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా అంతలా క్రేజ్ కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఇప్పటికే విడుదల అయినటువంటి "పుష్ప పార్ట్ 1" మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఉండడమే. ఇకపోతే పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఫాహధ్ ఫజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం అదిరిపోయే రేంజ్ విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని కూడా అత్యద్భుతంగా వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లోని ఓ సన్నివేశం కోసం ఈ మూవీ బృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఇంటర్వెల్ కంటే ముందు గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దాదాపు 30 నిమిషాల నిడివితో ఉండబోతున్న ఈ సన్నివేశం కోసం దాదాపు 50 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు కానీ ఈ సన్నివేశం మాత్రం అదిరిపోయే రేంజ్ లో రావాలి అని మూవీ బృందం కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా కేవలం సినిమాలోని ఒక సన్నివేశం కోసమే పుష్ప మూవీ యూనిట్ ఇంతలా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa