యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్..సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైంధవ్ మరియు నాగార్జున నా సామిరంగ వంటి బిగ్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగింది హనుమాన్..చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ  భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి  ఆదరణ పొంది భారీ విజయం సాధించింది. తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్ మరియు జపనీస్ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ వరల్డ్ మూవీగా రిలీజైన హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే, హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇక హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లలో హనుమాన్‌ను చూడటంతో మార్చి నెలకు వాయిదా వేశారు. మొదట మార్చి 1 లేదా 2వ తారీఖున హనుమాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ రెండు తేదీలు కాకుండా మరో తేదీని అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. హనుమాన్ మూవీని ఇంకాస్తా లేటుగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.  మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వీటి సందర్భంగా ఆరోజు నుంచి ఓటీటీలో హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ కానుంది.ఇదిలా ఉంటే, హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ కావటంతో దానికి తగినట్లుగానే జీ5 సంస్థ ఓటీటీ హక్కులు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: