ప్రస్తుతం మలయాళం కంటెంట్ పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీకి హిట్ ఫార్ములా గా నిలుస్తుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలకి ప్రేక్షకుల బ్రహ్మరధం పడుతున్నారు. అసలు భాషతో సంబంధం లేకుండా..స్టార్ ఇమేజ్ అనే ముద్ర లేకుండా జనాలు ఎంతగానో ఆదరిస్తున్నారు.తక్కువ బడ్జెట్ లో సినిమా చేసి వందల కోట్లు ఎలా కొల్లగొట్టాలో మలయాళం కంటెంట్ నేర్పిస్తుంది.'ది కేరళ స్టోరీ' నిజానికి ఇది హిందీ సినిమా అయినా ఇందులోని కంటెంట్ మాత్రం పూర్తిగా మలయాళంది.ఇంత చిన్న సినిమా పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఇతర భాషల నుంచి మలయాళం కంటెంట్ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఇక తాజాగా మరో మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు అందరి నోట ఈ సినిమాని వినిపిస్తుంది. ఇక అదే 'ప్రేమలు' అనే చిత్రం. ఈ నెల 9వ తేదీన మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.తొలి షోతోనే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అక్కడి ప్రేక్షకులు ఇది పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా అంటూ పెద్ద ఎత్తున  ప్రమోట్ చేసారు. దీంతో అదే మూవీని ప్రపంచవ్యాప్తంగా 15వ తేదీన రిలీజ్ చేశారు.


ఇప్పుడు అన్ని చోట్లా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. పైగా ఈ సినిమా బడ్జెట్ కేవలం 3 కోట్లు మాత్రమే. ఇంకా సాలిడ్ వసూళ్ళని రాబడుతూ ఈ సినిమా 100 కోట్ల వైపు చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఈ రేంజ్ వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ వసూళ్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో జరగడం విశేషం.ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది. ఇంకా ఈ సినిమా తెలుగు హక్కులను ఎస్.ఎస్. కార్తికేయ సొంతం చేసుకున్నారు. మార్చి 8న ఈ మూవీని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ దక్కించుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నస్లేన్, మమిత, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్ ఇంకా అఖిల భార్గవ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: