టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆశించిన ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకు మహేష్ బాబు స్టామినా వల్ల కలెక్షన్స్  భారీగానే వచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ కథను ఇప్పటికే స్టార్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారట.సూపర్ స్టార్ మహేష్ బాబును మునుపెన్నడూ చూడని విధంగా చూపించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసమే సినిమా మొదలయ్యే వరకు బయట ఫంక్షన్స్ కు, పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లకూడదని రిక్వెస్ట్ చేసాడట.


ఈ మూవీలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ కానీ లీక్ కానీ వస్తుంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రాజమౌళి బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన అక్కడి లోకల్ పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో మహేష్ బాబుతో చేస్తున్నా అని ఆ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నామని చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాజరు కానున్నారని సమాచారం వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: