టాలీవుడ్ చిన్న హీరోల్లో ఒకడైన విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ట్రైలర్ ఈమధ్య విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీజర్ పోస్టర్స్ ద్వారానే సినిమా టీమ్ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా అంతకుమించి అనేలా ఉండడంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.గామి సినిమాలో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించిన విధానం అయితే చాలామంది నటీ నటులను కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా  పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రత్యేకంగా గామి ట్రైలర్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. సినిమా ట్రైలర్ చూడగానే చాలా కొత్తగా అనిపించింది చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా బాగా నచ్చేసింది.


సినిమాకు వర్క్ చేసిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా పని చేశాయని అనిపిస్తోంది. ఇక  విశ్వక్ ఎప్పుడు కూడా  కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. గామి సినిమా మేకర్స్ కు మంచి సక్సెస్ ఇవ్వాలి.ట్రైలర్లోనే టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ కనిపించిందని చెప్పిన ప్రభాస్ ఈనెల 8వ తేదీన సినిమా విడుదల కాబోతోందని ఆరోజు కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా వివరణ ఇచ్చారు.ఇక ప్రభాస్ ప్రశంసలు అందుకున్న గామి సినిమా ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.ఈ సినిమాలో విజువల్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ లోనే హైలెట్ చేశారు. తక్కువ బడ్జెట్ లోనే మేకర్స్ మంచి క్వాలిటీ ఉన్న అవుట్ ఫుట్ ని ఇవ్వబోతున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ కూడా ఎప్పుడు చూడనంత సరి కొత్తగా ఉండబోతోంది.ఈ మధ్య కాలంలో కంటెంట్ కొత్తగా వున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి.మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: