తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శోభా శెట్టి బాగా సుపరిచితమే.. కార్తీకదీపం సీరియల్ లో నటించిన మౌనితగా బాగా క్రేజ్ అందుకుంది.. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని ద్వారా బిగ్ బాస్ లో అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఈ సీరియల్ కంటే ముందు పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.. బిగ్ బాస్ హౌస్ లో నుంచి కేవలం 11 వారాలకె హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్ బాస్ వల్ల శోభా శెట్టి కి ఎంత క్రేజ్ వచ్చిందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా అందుకుంది.

చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం ఓటమిని ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించకపోవడం తాను సాధించాలని పంతం వల్ల ఈమె పైన చాలా దారుణంగా ట్రోలింగ్స్ కూడా ఎదురయ్యాయి.. అయితే అందరికంటే ఎక్కువగా నెగెటివిటీ తోనే హౌస్ నుండి బయటికి వచ్చేసింది శోభా శెట్టి.. తాజాగా శోభాశెట్టి తన సొంత ఇంటి కల నెరవేర్చుకుంది.. గత ఏడాది క్రితమే ఆ ఇంటిని శోభాశెట్టి కొన్నప్పటికీ రీసెంట్గా అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట రోజున తన కొత్త ఇంటిని ఓపెన్ చేసింది..


తన తల్లి ప్రియుడు కాబోయే భర్త యశ్వంత్ తో కలిసి తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది..బుల్లితెర నటుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ వేడుకలను కూడా చాలా గ్రాండ్గా చేసుకుంది ప్రస్తుతం శోభా శెట్టి సీరియల్ లో పెద్దగా కనిపించలేదు.. అందుకు కారణం ఆమెకు నటన పట్ల ఆసక్తి లేదని.. హౌస్ నుంచి వచ్చేశాక ఒక టాక్స్ షోరూం చేసింది సుమన్ టీవీలో కాఫీ విత్ శోభా శెట్టి అనే పేరుతో ఈ టాక్ షోని ప్రారంభించింది. ఇందులో పలువురు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉండేది.. సొంతంగా ఇమే ఒక మేకప్ స్టూడియో పెట్టడంతో పాటు శిక్షణ కూడా ఇవ్వడం వల్ల డబ్బులు సంపాదించాలని భావిస్తోందట.అలాగే మరొక బిజినెస్ ఏమిటంటే హోల్సేల్ చీరలు అమ్మేలా ప్లాన్ చేసుకుంటుందట. నటన వల్ల పెద్దగా డబ్బులు రావని ఇలా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయని ఆలోచించి ఈమె బిజినెస్ బెటర్ గా భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: