మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో ' అ ఆ ' తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్టార్ డమ్ రాబట్టింది. తెలుగులోనే కాక ఇతర భాషల్లో నటిస్తూ బిజీ గా మారిపోయింది. రీసెంట్ గా ఈగల్ లో అనుపమ కీలక పాత్రలో కనిపించింది. ఇక త్వరలో టిల్లు స్క్వేర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి విశేష స్పందన లభించింది.ఇందులో అనుపమ గ్లామర్ డోస్ పెంచేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. అనుపమ లోని కొత్త కోణం చూసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన అనుపమ, ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ కి వెళ్ళింది. మారిషస్ అడవుల్లో, బీచ్ ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఫారెస్ట్ లో స్కై డైవింగ్, కార్ రేసింగ్, వాటర్ ఫాల్స్ వంటి సాహసాలు చేస్తూ, జంతువులతో ప్రకృతిని ఆస్వాదిస్తుంది.

వాటిని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుపమ తన ఫ్యాన్స్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ వీడియో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీన్ని బహుమతిగా ఇస్తే అనుపమ మీ సొంతం అయిపోతుంది అంటూ ఒక పోస్ట్ చేసింది. అడవి జంతువు హిప్పో పిల్ల వీడియో షేర్ చేస్తూ .. దీన్ని ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నేను వాళ్ళ సొంతం అయిపోతా అని చెప్పింది.సదరు వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు ఆ హిప్పో ని అనుపమకు గిఫ్ట్ గా ఇద్దాం పదండి అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అనుపమ అభిమానులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇక అనుపమ-సిద్ధూ జొన్నలగడ్డ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్రంపై యూత్ లో అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: