మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు. ఒకేతల్లికి పుట్టిన పిల్లలే ఒకలే ఉండనప్పుడు ఎక్కడో పుట్టి పెరిగి హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న కొందరు సెలబ్రిటీలు మరి భిన్నంగా ఉంటారు.అందులోను సీనియర్ యాంకర్ ఝాన్సీ.. నటిగా తనెకెన్ని గుర్తింపు లభించినా యాంకర్ గానే ఎక్కువ మందికి తెలిసింది. ఫస్ట్ జనరేషన్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఆమె బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అలాగే ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి ఝాన్సీ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో తన డ్రీమ్ హౌస్ ని బిల్డ్ చేస్తోంది. అయితే దానికోసం కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి వారి లోటస్ పాండ్ కి హస్తకళలని జోడిస్తున్నారు.అయితే సమాజంలో జరిగే ప్రతీ దానికి ఆమెకు వీలు కలిగినంతలో స్పందిస్తుంటుంది. కొంతకాలం క్రితం రిలీజైన సలార్ లో ఆమె ఓబులమ్మగా నటించి మెప్పించారు. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక తను ఇన్ స్టాగ్రామ్ లో 290K ఫాలోవర్స్ ని కలిగి ఉంది.

తను ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే మొదట 'సొంతం' మూవీలో సునీల్ తో కలిసి చేసిన ఆ కామెడీ వీడియోలు, మాటలు, పంచ్ లు అన్నీ ఇప్పటికీ ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ లో కన్పిస్తుంటాయి. ఇక ఝాన్సీ తాజాగా వితౌట్ మేకప్ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ పోస్డ్ కి .." నో మేకప్ ఈజ్ బెస్ట్ మేకప్.. సింపుల్ క్యారెక్టర్స్. అండ్ సింపుల్ కాటన్ సారీస్ ఆర్ ది సింప్లీ ది బెస్ట్" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే ముఖానికి ఏ మేకప్ లేకుంటేనే బాగుంటామని, అందులోను సింపుల్ కాటన్ చీరలలో మరీ అందంగా కన్పిస్తామని ఝాన్సీ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చింది. ఇలా సింప్లిసిటీతో పాటు సంప్రదాయాలని కాపాడుకుంటూ వస్తున్న ఝాన్సీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఝాన్సీ నటించిన సినిమాలలో మీ ఫెవరట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: