స్టార్ హీరోయిన్ లలో ఒకరైన త్రిష వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.సీనియర్ హీరోయినైనా సరే నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ యంగ్ హీరోయిన్లను ఆశ్చర్య పోయేలా చేస్తుంది. అయితే అలాంటి నటి త్రిష రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎంతో మంది అబ్బాయిల తో డేటింగ్ చేశాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. అయితే చాలామంది సెలబ్రిటీలు అడిగినట్లు తమ ప్రైవేట్ విషయాలను బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు.కానీ త్రిష మాత్రం తనకి సంబంధించిన ఈ ప్రైవేట్ విషయాన్నీ బహిరంగంగానే బయటపెట్టింది. మరి ఇంతకీ త్రిష ఎవరెవరితో ప్రేమలో ఉంది ఎవరితో డేటింగ్ చేసింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. త్రిష ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..నేను చాలా మందితో రిలేషన్ మెయింటైన్ చేశాను. డేటిం** కూడా చేశాను. కానీ ఎవరితో కూడా నా రిలేషన్ ఎక్కువ దూరం వెళ్లలేదు. నాకు ఆ రిలేషన్ వర్కౌట్ అవ్వలేదు.అందుకే నేను ఇప్పడివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది ఒక బాధ్యత.ఈ పెళ్లి విషయంలో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. కానీ నాకు పెళ్లి సెట్ అవ్వదని అనిపించింది. ఈ సమయంలో అయితే ఒకరి కోసం జీవించడం కంటే తనకోసం తాను జీవించడం ఎంతో మంచిదని నేను అనుకుంటాను. అందుకే నన్ను నేను చాలా ఎక్కువగా ప్రేమించుకుంటాను..అంటూ త్రిష సంచలన కామెంట్లు చేసింది.అయితే త్రిష చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో త్రిష ఎప్పటికీ పెళ్లి చేసుకోదా ఏంటి..ఎందుకు ఇలా మాట్లాడింది.. అబ్బాయిలతో రిలేషన్ తనకి బోర్ కొట్టింది కావచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక త్రిష ఇప్పటికే సిద్ధార్థ్, ధనుష్, శింబు, ప్రభాస్,రానా, విజయ్ వంటి హీరోలతో ప్రేమాయణం నడిపించిందనే వార్తలు వినిపించాయి. అలాగే బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మానియన్ తో పెళ్లి వరకు వెళ్ళింది.కానీ ఆ బంధం కూడా మధ్యలోనే తెగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: