సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంట్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా .. వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా బారి అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 2 వారాల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియా లో ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 వారాల్లో నైజాం ఏరియాలో 3.32 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 81 లక్షల కలెక్షన్ లు ,  ఆంధ్ర ప్రదేశ్ లో 3.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 2 వారాల్లో ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 7.39 కోట్ల షేర్ ... 14.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 2 వారాల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.31 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల్లో 9.70 కోట్ల షేర్ ... 19.35 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా మరో 1.30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk