సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిన్నటితో 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా డైరెక్ట్ గా నాలుగు థియేటర్ లలో 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఆ నాలుగు థియేటర్ లు ఏవి అనేది విషయాలను తెలుసుకుందాం. అమలాపురం లోని ... వి ఎల్ రామ థియేటర్ లో ఈ సినిమా డైరెక్ట్ గా 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. చిలకలూరి పేట లోని వెంకటేశ్వర థియేటర్ లో కూడా ఈ సినిమా డైరెక్ట్ గా 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. అలాగే ఏలూరు లోని వి మాక్స్ స్క్రీన్ 1 థియేటర్ లో కూడా ఈ మూవీ డైరెక్ట్ గా 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ మూడు థియేటర్ లతో పాటు కర్ణాటక లోని ముల్బాగల్ లో ఉన్న నటరాజ్ థియేటర్ లో కూడా ఈ సినిమా నేరుగా 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇలా ఈ సినిమా డైరెక్ట్ గా ఈ నాలుగు థియేటర్ లలో 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: