టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగినట్టున్గానే పుష్ప మూవీ బృందం ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి అదిరిపోయే రేంజ్ లో చర్చ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

"పుష్ప పార్ట్ 1" మూవీ లో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. సమంత మొట్ట మొదటి సారి తన కెరియర్ లో ఓ మూవీ లో ఐటమ్ సాంగ్ చేయడంతో పుష్ప సినిమా విడుదలకు ముందే ఈ ఐటమ్ సాంగ్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమా విడుదల తర్వాత కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడం ... అలాగే సమంత ఈ సాంగ్ లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో "పుష్ప పార్ట్ 1" మూవీ లోని ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ సక్సెస్ అయ్యింది. దానితో "పుష్ప పార్ట్ 2" మూవీ లో అంతకు మించిన స్థాయిలో ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని జనాలు ఆశిస్తున్నారు.

అలాగే చిత్ర బృందం కూడా ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ పై ప్రత్యేక శ్రద్ధని పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ తో "పుష్ప పార్ట్ 2" మూవీ లో ఐటెం సాంగ్ చేయించాలి అని మూవీ బృందం ఆలోచనలో ఉన్నట్లు ... ప్రస్తుతం అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa