టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య , చందు ముందేటి కాంబో లో సవ్యసాచి , ప్రేమమ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇకపోతే ఇందులో సవ్యసాచి మూవీ స్టేట్ మూవీ కాగా ... ప్రేమమ్ మూవీ మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ప్రేమమ్ సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది.

ఈ రెండు మూవీ లలో సవ్యసాచి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకోగా ... ప్రేమమ్ సినిమా మాత్రం పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం విరి కాంబో లో రూపొందుతున్న తండెల్ సినిమాలో నాగ చైతన్య కు జోడి గా సాయి పల్లవి నటిస్తూ ఉండగా ... ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా భాగమే పెండింగ్ ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను దాదాపుగా 6.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nc